“శ్యామ్ సింగ‌రాయ్” నుంచి సాయి ప‌ల్ల‌వి లుక్ విడుదల..!

May 9, 2021 at 11:06 am

సాయి ప‌ల్ల‌వి అంటే చాలా మందికి ఇష్టం. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేసింది. నాగ చైతన్య స‌ర‌స‌న శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ అనే చిత్రం చేసింది. అలానే రానా స‌ర‌స‌న విరాట ప‌ర్వం చిత్రంలో న‌టించింది. ఈ రెండు చిత్రాలు క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డాయి. ఇక గ‌త కొద్ది రోజులుగా ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెర‌కెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో బిజీగా ఉంది.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. నేడు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి సాయిపల్లవి పోస్టర్ ను విడుదల చేశారు. కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం తెర‌కెక్కుతుండటం వల్ల కాళికాదేవి అవ‌త‌రంలో సాయి ప‌ల్ల‌వి ఉగ్ర‌రూపం దాల్చిన‌ట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

“శ్యామ్ సింగ‌రాయ్” నుంచి సాయి ప‌ల్ల‌వి లుక్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts