`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్‌.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్‌?!

May 18, 2021 at 9:24 am

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా న‌టించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో చైతూకు జోడీగా స్టార్ హీరోయిన్ న‌టించ‌బోతోంద‌ట‌.

ఇంత‌కీ ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. చైతు భార్య స‌మంత‌నే. బంగార్రాజు సినిమాలో నాగచైతన్య భార్య పాత్రలో సమంత నటిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ జంట సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణలకు కొడుకు కోడళ్లుగా కనిపించనున్నారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్‌.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts