బాలయ్య సరసన సీనియర్ నటి..?

May 7, 2021 at 12:50 pm

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది.

అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. అలాగే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ చిత్రంలో కూడా మీనా నటిస్తుందని సమాచారం. బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. తాజాగా బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కు జోడీగా మీనా నటిస్తున్నారని సమాచారం. బాలయ్య భార్య పాత్రలో మీనా కనిపించనుందని సినీ వర్గాల టాక్.

బాలయ్య సరసన సీనియర్ నటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts