ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువెంతంటే..!

May 7, 2021 at 8:36 pm

అధికారులు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నా గోల్డ్ స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొంద‌రు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మ‌రికొంద‌రు ప్రైవ‌ట్ శ‌రీర‌భాగాల్లో కూడా పెట్టుకుని స్మ‌గ్లింగ్ చేసేందుకు య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఒక‌రు ఏకంగా గ్లైండ‌ర్‌లో బంగారాన్ని పెట్టుకుని త‌ర‌లించేందుకు య‌త్నించి క‌స్ట‌మ్స్ అధికారులకు చిక్కాడు. ఆ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రోసంఘ‌ట‌న వెలుగుచూసింది. భారీ మొత్తంలో బంగారం బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే 526 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు తన లగేజీ బ్యాగ్ లో 2.6 కేజీల అక్రమ బంగారం తరలిస్తుంన్నాడనే విశ్వసనీయ సమాచారంతో అతని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టురట్ట‌యింది. బంగారంతో పాటు నిందితుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.. పట్టుబడిన బంగారం విలువ దాదాపు 1.28 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.

ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువెంతంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts