బాల‌య్య‌కు జోడీగా ప్ర‌భాస్ హీరోయిన్‌..సెట్ చేసిన గోపీచంద్‌?

May 7, 2021 at 9:57 am

క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మాలినేని.. త్వ‌ర‌లోనే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ చేస్తున్న బాల‌య్య‌.. ఆ వెంట‌నే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయ‌నున్నారు.

వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క‌థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని.. అందులో బాల‌య్య‌ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని టాక్‌. ఇక క‌థ‌కు త‌గ్గ‌ట్టు ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. అయితే వారిలో ఒక హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్‌ను గోపీచంద్ సెట్ చేశాడ‌ట‌.

గోపీచంద్ తెర‌కెక్కించిన బలుపు, క్రాక్ చిత్రాల్లో శ్రుతినే హీరోయిన్‌. ఈ చిత్రాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో శ్రుతి గోపీచంద్‌కు ల‌క్కీ హీరోయిన్ అయిపోయింది. అందుకే మరోసారి శ్రుతినే హీరోయిన్‌గా ఎంచుకున్నాడ‌ట. కాగా, శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రం చేస్తోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెట్స్ మీదే ఉంది.

బాల‌య్య‌కు జోడీగా ప్ర‌భాస్ హీరోయిన్‌..సెట్ చేసిన గోపీచంద్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts