`బంగార్రాజు` కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ భామ‌?!

May 7, 2021 at 11:39 am

ఇటీవ‌ల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఆ పాత్ర ఆధారంగానే ప్ర‌స్తుత సినిమా తెర‌కెక్కబోతోంది.

ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపు పూర్త‌య్యాయి.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హాని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే.. సోనాక్షితో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో ర‌మ్యకృష్ణ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

`బంగార్రాజు` కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ భామ‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts