కళ్యాణి దర్శకత్వంలో యువ హీరో..?

May 1, 2021 at 12:08 pm

తెలుగు సీనియర్ నటి కళ్యాణి అప్పట్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే మూవీ చేయగా, ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదట మలయాళం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెర పై తళుక్కుమంది కళ్యాణి. అంతే కాకుండా ఆమె తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

ఈ మధ్య సినిమాలకు దూరం అయింది కళ్యాణి. కానీ అతి త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందట‌. అది కూడా డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. చేతన్ శీను అనే యువ హీరో ను తన దర్శకత్వం తో ఇంట్రడ్యూస్ చేయనుందట. ఈ మూవీ గ్లిమ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికి కళ్యాణి రీ ఎంట్రీ తో డైరెక్టర్ గా పరిచయం కానుంది.

కళ్యాణి దర్శకత్వంలో యువ హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts