చిన్నారి ప్రాణం కోసం ఆ యువ హీరో ఏమిచేశారంటే..?

ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవాళ్లు సినిమా ఇండిస్టీలో చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ఓ చిన్నారి ప్రాణాల‌ను రక్షించేందుకు నిధులు సేకరిస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తన ఆపరేషన్ కు నేను లక్ష రూపాయ‌లు సాయం చేస్తున్నా. కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ.3.5 లక్షలు అవసరం ఉంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ సుధీర్ బాబు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారి కోసం హీరో సుధీర్ బాబు చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సుధీర్ బాబు గతేడాది నానితో కలిసి ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మరో రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ఓ సినిమా ‘పలాస’ సినిమా దర్శకుడు కరుణాకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ పెట్టారు. ఇటీవల సుధీర్ బాబు జన్మదినం సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఉప్పెన సినిమా ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకి “ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది” అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో వీరి కలయికలో ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.