సందీప్ కిషన్ గొప్ప మనసు..!

May 4, 2021 at 3:06 pm

యావత్ ప్ర‌పంచం అంతా క‌రోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జ‌రుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఒక‌రికి ఒక‌రం అండగా ఉండాలి. సినీ సెల‌బ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిష‌న్ అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా ఉంటానంటూ ట్వీట్ చేసి అంద‌రి మనల్లను పొందుతున్నాడు. క‌రోనా కార‌ణంగా త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్లల బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చాడు హీరో సందీప్ కిష‌న్.

మీ చుట్టు ప‌క్క‌ల తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వారి వివరాలను [email protected] కు తెలియ చెప్పండి. ఈ కోవిడ్ విపత్తి కార‌ణంగా చిన్నారులు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారిన వారి బాధ్య‌త‌ను నేను, నా టీమ్ చూసుకుంటాం. వారికి కావ‌ల‌సిన తిండి, చ‌దవు, ఇతర అవ‌స‌రాలన్ని రెండు సంవ‌త్స‌రాల పాటు మేము చూసుకుంటాం. మీకు కూడా కుదిరితే కొంత సాయం చేయండి అంటూ సందీప్ త‌న ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

సందీప్ కిషన్ గొప్ప మనసు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts