సునీల్‌ను వ‌ద‌ల‌ని త్రివిక్ర‌మ్‌..ఈసారైనా స‌క్సెస్ అయ్యేనా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సునీల్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌.

క‌మెడియ‌న్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. హీరోగా మారాడు. అయితే ఈ మ‌ధ్య కెరీర్ బాగా డ‌ల్ అయిపోయివ‌డంతో.. మ‌ళ్లీ కామెడీ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల మీద దృష్టి పెట్టాడు. అయిన‌ప్ప‌టికీ సునీల్ జోరు ఏ మాత్రం పెర‌గ‌లేదు. దాంతో తన స్నేహితుడిని హిట్‌ట్రాక్‌ ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్‌.

ఈ క్ర‌మంలోనే అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల్లో సునీల్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ, సునీల్‌కు పెద్ద గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడోసారి సునీల్ కెరీర్‌ను గాడిలో పెట్టే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా మ‌హేష్ సినిమాలో సునీల్‌కు ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌ను డిసైన్ చేశాడ‌ట‌. ఆ పాత్ర సినిమాకు ఓ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ట‌. మ‌రి ఈ సారైనా త్రివిక్ర‌మ్ ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతాయో లేదో చూడాలి.