రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?

May 7, 2021 at 2:08 pm

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య అందంతో పాటు నటన పై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంది. తనకున్న గ్లామర్ కి అభినయం జోడించి తన సినీ కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె పని చెయ్యటం వల్ల చాలా తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తాజాగా ఇప్పుడు తమన్నాకి ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని నిలబడటం కాస్త కష్టమవుతుంది.

ప్రస్తుతం తమన్నా చేస్తున్న చిత్రాల్లో ఎఫ్ 3 మాత్రమే కాస్త చెప్పుకోదగిన సినిమా. ఈ క్రమంలో ఆమె వెబ్ సిరీస్ లపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రధారిగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే రెండు వెబ్ సిరీస్ లు రూపొందడం విశేషం. ఇకపోతే తమన్నా సినిమాల్లో కూడా ఇక మీదట గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా క్రైమ్ థ్రిల్లర్లు , సస్పెన్స్ ఇంకా హారర్ థ్రిల్లర్లు చెయ్యాలనే ఉద్దేశంతో ఆమె ఉందని అంటున్నారు అంతా .అంటే భవిష్యత్తులో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేయాలి ఆలోచనలో ఉన్నారట తమన్నా.

రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts