తిరుప‌తి ఉప ఎన్నిక‌..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!

May 2, 2021 at 9:56 am

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితాలు నేడు రానున్న సంగ‌తి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఎంతో ఉత్కంఠ‌గా ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం జోరు జోరుగా లిక్కింపు సాగుతోంది.

అయితే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుండగా.. వైఎస్ఆర్ సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. మధ్యాహ్నంలోగా విజేత ఎవరన్నది తెలియనుంది.

తిరుప‌తి ఉప ఎన్నిక‌..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts