క‌రోనా వైరస్ వల్ల ప్రేక్ష‌కులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌..!

కరోనా మ‌హ‌మ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు క‌రోనా వైరస్ బారిన‌ ప‌డి ఎందరో చనిపోతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు పై నిషేధం విధించాయి. చివరికి ఐపీఎల్ లాంటి టోర్నీల‌ను కూడా ప్రేక్ష‌కులు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇలాగే గ‌త సంవత్సరం జ‌రుగాల్సి ఉన్న, టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రేక్ష‌కులు లేకుండానే జరపనున్నారని సమాచారం.

ఈ విషయాన్ని టోక్యో 2020 అధ్యక్షురాలు షికో హషిమోటో వ్యాఖ్యానించ‌డం పెద్ద చ‌ర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ మరలా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే ఒలింపిక్స్‌కు విదేశీ ప్రేక్ష‌కుల‌ను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా హషిమోటో చేసిన‌ పలు వ్యాఖ్యలతో జపనీయులకు కూడా టోక్యో ఒలింపిక్స్‌ను నేరుగా చూసే ఛాన్స్ లేదు అనిపిస్తోంది. అయితే దీని పై జూన్‌లో పూర్తి స్పష్టత రానుంది.