భ‌లే విచిత్రం.. ప్ర‌తిప‌క్ష‌నేత‌కు మంత్రి బ‌హిరంగ‌లేఖ‌

ఎక్క‌డైనా స‌రే అధికార పార్టీకి, మంత్రుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు లేఖ‌లు రాయ‌డం, విజ్ఞ‌ప్తులు చేయ‌డం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం మంత్రినే ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ లేఖ రాసింది ఎవ‌రంటే తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, మ‌రి ఎవ‌రికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప‌లు అరోపణలను చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మంత్రి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిరాధారం, దురుద్దేశ పూరితం ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తాన‌ని మంత్రి హెచ్చ‌రించారు. అధారాల్లేని ఆరోపణలు చేస్తున్నా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడుగా ఖండించక పోవడం విచారకర‌మ‌ని ఉత్త‌మ్‌పై ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా.. త‌న స్వంత మండలం పాన్ గల్ మండలకేంద్రం సమీపంలో ఉన్న భూముల‌ను తాను, త‌న సతీమణి పేరు మీద ఉన్న వివరాలు 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నాన‌ని, అది ప్రజలందరికీ తెలిసిందేన‌ని.. గూగుల్ డొమైన్ లో వెతికినా కనిపిస్తుంద‌న‌ని, 30 ఎకరాలు త‌న పేరు మీద, 10 ఎకరాలు త‌న‌ సతీమణి పేరు మీద ఉంద‌ని, 15 ఏళ్లుగా అందులో మామిడితోట ఉంద‌ని స్థానికంగా డాక్టరైన నా కూతురు అక్కడి నుంచి ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు త‌న సతీమణి స్వంత నిధులు, పాన్ గల్ ఎస్ బీ ఐ బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణంతో నిర్మించామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. – రెండేళ్ల క్రితం స్వచ్చందంగా గోశాలను నిర్వహించేందుకు 2.5 ఎకరాలు కొత్తగా కొనుగోలు చేశామ‌ని, అక్కడ , ఇటీవల చండూరు గ్రామంలో ఉన్న నా 10 ఎకరాల భూములతో సహా మొత్తం కేవలం 50 ఎకరాల లోపే .. కానీ 200 ఎకరాలు ఉందని ఆరోపించడం నా ప్రతిష్టకు భంగం కలిగించడమే మండిప‌డ్డారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపణలు నిజమైన హక్కు దారులకు మేలు చేసేవి కావ‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి బహిరంగ లేఖను విడుద‌ల చేశారు.