క‌రోనా బారిన అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌.. ఆర్జీవీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

May 7, 2021 at 9:51 pm

ముంబాయి బాంబు పేలుళ్లు అనగానే గుర్తుకు వ‌చ్చే పేరు దావూద్ ఇబ్ర‌హీం. అత‌ని ప్ర‌ధాన అనుచ‌రుడు చోట రాజ‌న్‌. వారిద్ద‌రి పేర్లు అంద‌రికీ తెలిసిందే. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేయ‌గా, రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక‌ దావూద్ దేశం విడిచి పారిపోగా, చోటారాజ‌న్‌ను గ‌తంలో పోలీసులు అరెస్టు చేయగా తీహార్ జైలులో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వార్తలు జోరుగా ప్ర‌సారం అవుతున్నాయి. అయితే దీనిపై తీహార్‌ జైలు డీజీ, ఎయిమ్స్‌ అధికారులు సైతం స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్‌ సదాశివ్‌ నికల్జే అలియాస్‌ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించి స్పష్టత నిచ్చారు.

ఇదిలా ఉండ‌గా అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఒక ట్వీట్‌ చేశాడు. ‘చోటా రాజన్‌ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్‌ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్‌ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఇప్పుడిదీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుడుతున్న‌ది. ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీపై కూడా ఆర్టీజీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు. సోనియా గాంధి అన్న మాట‌ల‌ను ఉంట‌కిస్తూ పీఎం మౌత్ కా సౌదాగ‌ర్ అంటూ ట్విట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా బారిన అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌.. ఆర్జీవీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts