తీవ్ర విషాదంలో విజయదేవరకొండ …!?

May 2, 2021 at 10:19 am

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో టాలీవుడ్‌ను షేక్ చేశారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా అంటూ అలా దూసుకుపోతూనే వచ్చారు. మధ్యలో ఫ్లాపులు పలకరించినా కూడా ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అలా విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విజయ్‌ను ఇష్టపడేవారెంతో మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే విధానం, ఆకట్టుకునే విధానం అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తుంటాయి. అలా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏకంగా బాలీవుడ్‌కి పాకింది. అక్కడ ఒక్క సినిమా తీయకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ తాజాగా తన అభిమానిని కోల్పోవడంతో ఎమోషనల్ అయ్యారు. నిన్నా మొన్నా విజయ్ దేవరకొండకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కాసాగింది.

హేమంత్ అనే అభిమాని చివరి కోరికను విజయ్ దేవరకొండ తీర్చేశారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడి ఆఖరి కోరిక తీర్చారు. అంతే కాకుండా ఆ అభిమాని అడిగినట్టు కొన్ని టీషర్ట్, షర్ట్‌లను పంపించారు. అవి చూసి సదరు అభిమాని ఎంతగానో సంతోషించారు. తాజాగా ఆ అభిమాని మరణించడంతో విజయ్ కంటతడి పెట్టేసుకున్నారు. ఈమేరకు ఓ పోస్ట్ చేశారు. ఐ మిస్ యూ హేమంత్.. మనం మాట్లాడుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. నీ స్వచ్చమైన నవ్వును చూసే చాన్స్ వచ్చింది.. నీ ప్రేమ నన్ను తాకింది.. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్.. నీ గురించి ఆ దేవుడిని ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను. హేమంత్‌ను కలిసేందుకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నిన్ను మిస్ అవుతున్నాం హేమంత్.. నీతో మాట్లాడిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఎమోషనల్ అయ్యారు.

తీవ్ర విషాదంలో విజయదేవరకొండ …!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts