తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య దేర‌వ‌కొండ కీల‌క సూచ‌న‌!

May 8, 2021 at 7:31 am

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా వేల మందిని బ‌ల‌తీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే కోవిడ్ మందుల కిట్‌ను వాడండ‌ని సూచించారు. మ‌రోవైపు టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌రకొండ కూడా తెలంగాణ స‌ర్కార్‌తో చేతులు క‌లిపి.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న చేశారు.

తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశార‌ని..ఎవ‌రికైనా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి క‌రోనా లక్షణాలు ఉంటే..టెస్ట్ కోసం స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా వెంట‌నే అక్కడ డాక్టర్లను సంప్రదించి కోవిడ్ మందుల కిట్‌ తీసుకుని వాడ‌మ‌ని విజ‌య్‌ సూచించారు. ఈ మేర‌కు ఓ వీడియో రూపంలో తెలియ‌జేశాడు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య దేర‌వ‌కొండ కీల‌క సూచ‌న‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts