టీవీ షోకు హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!

త‌మిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవ‌లం హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైస్ చేస్తున్నాడీయ‌న‌. ఇటీవ‌ల ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయారు.

ప్ర‌స్తుతం ఈయ‌న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇదిలా ఉంటే.. విజ‌య్ వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. సన్‌ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్‌ చెఫ్‌ తమిళ్‌కు హోస్ట్‌గా విజ‌య్ వ్యవహరించనున్నాడు.

అయితే ఈ షో కోసం విజయ్‌ అందుకోబోతున్న రెమ్యూనరేషన్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడు విజయ్‌. అయితే క‌రెక్ట్ ఫిగ‌ర్ తెలియ‌క పోయినా.. ఈ మాస్ట్ చెఫ్ షోకు అంత‌కు మించి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట విజ‌య్. మ‌రి బుల్లితెర‌పై ఈయ‌న ఏ మేర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడో చూడాలి.