కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్‌ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల సేకరణ అవ్వటం విశేషం. అందరికంటే ఎక్కువగా ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ రూ. 5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ విరాశాలను అన్ని అనుష్క విరాట్ జంట ఏసీటీ గ్రాంట్స్‌ అనే సంస్థకు ఇవ్వనున్నారు.

కొవిడ్​తో పోరాడుతున్న భారతదేశానికి ఎందరినుండో మద్దతు లభిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంస్థ వారు 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు విరాళం ప్రకటించగా, భారత మాజీ ఆల్‌రౌండర్‌ లక్ష్మీ రతన్‌ శుక్లా కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్‌ కామెంటరీ ద్వారా తాను పొందిన జీతాన్ని మొత్తం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చాడు. ఇలానే పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘలు కూడా సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు.