త్వరలో వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌..!

May 3, 2021 at 4:16 pm

ప్రపంచంలో అందరు ఎక్కువగా వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. వాట్సాప్‌ ద్వారా ఎవరికైనా సందేశాలను పంపగలము. మనం పంపే మెసేజ్‌ల్లో అపుడప్పుడు ఏమైనా తప్పులు ఉంటె,చూసి సరిచేసి మరలా మెసేజ్‌లను పంపుతాం. ఈ ససౌకర్యం కేవలం వాట్సాప్‌లో మెసేజ్‌లకు మాత్రమే పరిమితం. వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌లకు ఈ సౌకర్యం ప్రస్తుతం లేదు. వాయిస్‌ మెసేజ్‌లను పరిశీలన లేకుండానే పంపుతుంటాం.

దీనికి వాట్సాప్‌ త్వరలోనే చెక్‌ పెట్టబోతుంది. త్వరలో వాట్సాప్‌ తీసుకురానున్న ఈ సరికొత్త ఫీచర్‌తో వాయిస్‌ మెసేజ్‌లను కూడా పునః పరిశీలించి పంపించుకునే వీలు ఉంటుంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఇంకా పరీక్షిస్తోంది. ఇదే కాకుండా వాయిస్‌ మెసేజ్‌లను వినియోగదారులు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల్లో మెసేజ్‌లను వినవచ్చు కూడా. ఈ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌ని ప్లేబ్యాక్ వేగాన్ని యూజర్లు నియంత్రించుకోవచ్చు. అంటే భవిష్యత్తులో వాయిస్‌ మెసేజ్‌లను పంపేటప్పడు రివ్యూ సౌకర్యం ఉండేలా వాట్సాప్‌ తీసుకొస్తుంది.

త్వరలో వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts