వైరల్ : ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జననం..!

మహిళలు కవల పిల్లలకు జన్మ ఇవ్వటం మాములు విషయమే. కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మ ఇస్తుంటారు. ఒక మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మ ఇచ్చింది. ఈ విషయం విన్న అందరు షాక్ కి గురి అవుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే గత సంవత్సరం ఆగస్టులో గర్భం దాల్చింది.

మూడు నెలల వరకు సాధారణంగానే ఉంది. మూడు నెలల తర్వాత సాధారణ గర్భవతులకంటే పెద్ద పొట్ట కనిపించింది. దీనితో వెంటనే వైద్యులను సంప్రదించారు. వైద్యులు స్కానింగ్ చేస్తే, కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్టు వారు గుర్తించారు. దీంతో ఆమెను మాలీలోని మోరాకోకు పంపించారు. మంగళవారం నాడు ఆమెకు సర్జరీ చెయ్యగా, ఏడుగురు పిల్లలు జన్మిస్తారు అనుకున్నారు కానీ అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వైద్యులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. 9 మందిలో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఉన్నారు. తల్లి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.