జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఉద్యోగులకు అది తప్పనిసరి..!

June 30, 2021 at 12:57 pm

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులందరూ రేపటి నుంచి తప్పని సరిగా బయో మెట్రిక్ వేయాల్సిందేని తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు కూడా రేపటి నుంచి కార్యాయానికి వచ్చాక వెళ్లే ముందు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని తెలిపారు.

అంతే కాకుండా సెలవులు, లీవ్ లకు సంబంధించని దరఖాస్తులను హెచ్ఎంఆర్ఎస్ లోనే చేసుకోవానలన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీసుల్లోనే ఉండి వినతులను తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా బయటికి వెళ్తే… రిజిస్టర్‌లో తప్పనిసరిగా పేర్లు నమోదు చేయాలని తెలిపారు. బయోమెట్రిక్ కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు అందరు ఉద్యోగులు సక్రమంగా పాటించేటట్లు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు చూడాలని తెలిపారు. అంతే కాకుండా ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు తెలిపింది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారు.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఉద్యోగులకు అది తప్పనిసరి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts