1990 బ్యాక్ డ్రాప్ సినిమాలో మాస్ రాజా..!

June 14, 2021 at 5:31 pm

టాలీవుడ్‌లో ఈ మ‌ధ్య పీరియాడిక్ మూవీల క‌థ‌లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా 1990 కాలానికి చెందిన కథలతో డైరెక్ట‌ర్లు మాయ చేస్తున్నార‌ని చెప్పాలి. రామ్‌చ‌ర‌ణ్ తో వ‌చ్చిన రంగస్థలం ద‌గ్గ‌రి నుంచి చాల‌వ‌ర‌కు ఇలాంటి సినిమాలు హిట్ కొట్టాయి. పీరియాడిక్ డ్రామాలుగానే వ‌స్తున్నా.. చాలా ఇంట్రెస్టింగ్ క‌థ‌లు కావ‌డంతో హిట్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ కూడా ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తోనే వ‌స్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ కూడా పాతికేళ్లు త‌న సినిమాలో వెనక్కు తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ అనే కొత్త డైరెక్ట‌ర్‌తో రవితేజ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిన‌మా కథ పూర్తిగా 1990 బ్యాక్ డ్రాప్ గా సాగుతుంద‌ని తెలుస్తోంది. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ పాతికేళ్లు వెన‌క్కు తీసుకెళ్ల‌బోతున్నాడు ర‌వితేజ‌. ఇందుకోసం ఇప్ప‌టికే కొన్ని సెట్టింగ్ లను కూడా రెడీ చేయిస్తున్నారంట‌. అంతే కాదు ఇప్ప‌టికే వేసిన ప‌లు సినిమాల సెట్ల‌ను కూడా ఈ మూవీ కోసం వాడుతారంట‌.

1990 బ్యాక్ డ్రాప్ సినిమాలో మాస్ రాజా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts