సూప‌ర్ కిక్ ఇచ్చిందంటున్న రామ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సూప‌ర్ డూప‌ర్ కిక్ ఇచ్చిందంటూ తాజాగా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. రామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ చిత్రంపై తాజాగా రామ్‌ ఓ అప్‌డేట్‌ను ఇచ్చాడు.

లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్‌ మెప్పించింది త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని రామ్ వెల్లడించారు. ఈ మేర‌కు `చివరి కథనం పూర్తయింది. స్క్రిప్ట్‌ సూపర్‌ డూపర్‌ కిక్‌ ఇచ్చింది. కెమెరాను రోల్‌ చేయండి. లవ్‌ యూ సార్‌` అని రామ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక రామ్ మాట‌ల బ‌ట్టీ చూస్తుంటే.. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్టు అర్థం అవుతోంది.