ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన అక్కినేని హీరో..?!

June 30, 2021 at 7:12 pm

అక్కినేని న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అయితే ఇంకా ఈ సినిమా పూర్తి కాకుండానే.. మ‌రో డైరెక్ట‌ర్‌కు అఖిల్ ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నాడ‌ట‌. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌నున్నార‌ట‌.

అంతేకాదు, ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్క‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. అయితే శ్రీ‌ను వైట్ల గ‌త కొన్నేళ్ల నుంచి వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు అఖిల్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. ఇలాంటి త‌రుణంలో అఖిల్ శ్రీ‌ను వైట్ల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన అక్కినేని హీరో..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts