`మ‌నం` డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్‌..త్వ‌ర‌లోనే..?

June 9, 2021 at 12:00 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. బ‌న్నీ త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు తెర‌పైకి వ‌చ్చినా.. స‌రైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్న‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ గుర్తింపు తెచ్చుకున్న విక్ర‌మ్ కె కుమార్ బ‌న్నీ కోసం ఓ మంచి క‌థ రాశాడ‌ట‌.

Vikram K Kumar Wiki, Age, Height, Family, Net Worth, Biography & More

త్వ‌ర‌లోనే ఆ క‌థ‌ను బ‌న్నీ కూడా వినిపించ‌నున్నాడ‌ట‌. ఒక‌వేళ బ‌న్నీకి ఆ క‌థ న‌చ్చితే.. పుష్ప‌ త‌ర్వాత ఈ చిత్ర‌మే సెట్స్ మీదకు వెళ్ల‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, విక్ర‌మ్ కె కుమార్ ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌తో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానుంది.

`మ‌నం` డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్‌..త్వ‌ర‌లోనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts