మూగజీవాలకు పెళ్లి బోజనం..ఎక్కడంటే..?

ఈ క‌రోనా ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలామంది తిన‌డానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక మూగ‌జీవాల ప‌రిస్థితి మ‌రీ దారుణం. వాటిని ప‌ట్టించుకునే వారే లేదు. అయితే కొత్త‌గా పెండ్లి చేసుకున్న ఓ జంట అంద‌రికీ ఆదర్శంగా నిలిచింది. వాళ్లు రీసెంట్‌గా కర్ఫ్యూలో పెండ్లి చేసుకున్నారు.

దీంతో తమ వివాహానికి చాలా డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా మిగిల‌డంతో మూగజీవాల ఆహారానికి వాటిని ఖ‌ర్చుచేసి వాటి ఆకలి తీర్చారు. చైన్నెకి చెందిన కొత్త భార్యా భ‌ర్త‌లు నిఖిల్‌, రక్ష కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. అక్క‌డే ఉండే ఇందిరా జైన్‌, ఉమాదేవి న‌డిపిస్తున్న శ్రీమహావీర్‌ జైన్‌ పశుసేవా కేంద్రంలో ఉండే పశువులు, పక్షులకు మూడు రోజుల వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఆహారాన్ఇన అందించారు. ఇందుకు రూ.45వేల వ‌ర‌కు అంద‌జేశారు. దాంతో పశుసేవా కేంద్రం నిర్వాహకులు మే 24, 25, 26 తేదీల్లో ఆ ఆహారాల‌ను జీవాల‌కు అంద‌జేసి వాటి ఆక‌లిని తీర్చారు.