దిశ యాప్ ను ప్రారంభించిన సీఎం..!

June 29, 2021 at 4:07 pm

‘దిశ’.. మీ భద్రతే మా భాద్యత
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ యాప్‌ పరిచయ కార్యక్రమంను నిర్వహించారు. ఇప్పటికే మహిళల రక్షణ కోసం దిశ పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసులను నియమించిన ఏపీ సీఎం తాజాగా దిశ యాప్ ద్వారా మరింతగా ఆడవారికి రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్ ను 17 లక్షల మంది అక్కలు చెల్లెల్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రతి ఒక్కరి బాధ్యత మాది అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. దిశ యాప్‌ ద్వారా ఇప్పటికే 850 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించినట్లుగా ఆయన పేర్కొన్నారు.

850 ఫిర్యాదుల్లో 160 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ లు కూడా నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండేందుకు దిశ యాప్‌ మరింతగా ఉపయోగదాయకం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ యాప్ ను తమ మొబైల్‌ లో ఉంచుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. యాప్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ప్రమాదం లో ఉంటే యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. కనుక ప్రతి ఒక్క మహిళ ఈ యాప్ వినియోగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిశ యాప్ ను మీ భద్రతే మా భాధ్యత అనే ట్యాగ్‌ లైన్ తో డిజైన్‌ చేశారు. ఈ యాప్ మహిళలకు రక్షణ కల్పించడంలో అద్బుత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం.

దిశ యాప్ ను ప్రారంభించిన సీఎం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts