బాలయ్యకు స్టార్ క్రికెటర్ ఊహించని విషెష్.!

June 10, 2021 at 4:31 pm

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ పేరుతో ఉన్న యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. అయితే భార‌త మాజీ క్రికెట‌ర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువ‌రాజ్ సింగ్..బాల‌కృష్ణ‌తో క‌లిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశాడు. బాల‌కృష్ణ సార్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నాను మీ ఎంట‌ర్‌టైనింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు సామాజిక కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్ర‌భావితం చేయాలని కోరుకుంటున్నాను అని యువ‌రాజ్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఊహించ‌ని విధంగా బాల‌య్య‌కు యువ‌రాజ్ నుండి బ‌ర్త్ డే శుబాకాంక్ష‌లు రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.కాగా, బాల‌య్యకు తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి చిరంజీవి,వెంక‌టేష్‌, మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌దిత‌ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

బాలయ్యకు స్టార్ క్రికెటర్ ఊహించని విషెష్.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts