ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య ఆవేశం..వర్కౌట్‌ కాదంటూ వ్యాఖ్య‌లు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే చూడాల‌ని అభిమాన‌లు, టీడీపీ శ్రేణులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా ఎన్టీఆరే అంద‌రికీ క‌నిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది.

కానీ, రోజులు, సంవ‌త్స‌రాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటిక‌ర్ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. అయితే బ‌ర్త్‌డే సందర్భంగా బాల‌య్య తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య మాట్లాడుతూ..ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి అని వ్యాఖ్యానించారు. దీనిపై తాను పెద్ద‌గా ఆలోచించ‌డం లేద‌ని బాల‌య్య తెలిపాడు.

అలాగే ఎన్టీఆర్ టీడీపీకి ప్లస్‌ అనుకుంటున్నారా? మైనస్‌ అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించ‌గా..ప్లస్‌ కావచ్చు, మైనస్‌ కూడా కావచ్చు. ప్లస్ ప్లస్‌ మైనస్‌ మైనస్‌ ప్లస్‌ అంటూ తికమక సమాధానం చెప్పారు బాల‌య్య‌. అంత‌లోనే ఆనాడు రామారావుగారు సినిమాల్లో ఉండి, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యారు. రామారావులా సినిమాల్లో ఉన్నాం కదా అని అనుకుంటే అందిరికి వర్కౌట్‌ కాదని బాల‌య్య కాస్త ఆవేశం వ్య‌క్తం చేశారు.