ఎస్బీఐ బ్యాంకు ప‌నిగంటల్లో మార్పులు

June 10, 2021 at 4:54 pm

ఇండియాలోనే అనిపెద్ద బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ వ‌చ్చింది. ఎందుకంటే ఇక‌పై ఎస్‌బీఐ ప‌ని చేసే టైమింగ్స్ మారాయండి. కొవిడ్ కారణంగా ఇప్పుడున్న బ్యాంకు పనివేళల్లో ఇబ్బందులు ఉన్నాయని కొత్త‌గా టైమింగ్స్ ఛేంజ్ చేశారు. కాబ‌ట్టి బ్యాంక్‌కు వెళ్లాలని అనుకునే వారు కొత్త టైమింగ్స్ ముందుగానే తెలుసుకోవడం చాలా బెట‌ర్‌.

ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా కొత్త టైమింగ్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉదయం 7 నుంచి 10 గంటల దాకా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో మార్నింగ్ 8 నుంచి 11 దాకా, అలాగే మ‌రిన్ని రాష్ట్రాల్లో మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఎస్బీఐ బ్యాంకులు సేవ‌లందిస్తుయ‌ని చెప్పారు. అయితే ఇప్ప‌డు క‌రోనా వైరస్ నుంచి త‌ప్పించ‌కుకోవ‌డానికి ప్ర‌జ‌లు బ్యాంకుల‌కు రావ‌డం త‌గ్గించాల‌ని కోరుతున్నారు. అప్పుడే క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కొత్త టైమింగ్స్‌ను అంద‌రూ ఫాలో అవ్వాల్సిందే. ఈ సమయం ప్రకారమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

ఎస్బీఐ బ్యాంకు ప‌నిగంటల్లో మార్పులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts