బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?

June 13, 2021 at 12:24 pm

బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే క‌రోనాతో క‌ట‌క‌ట‌లాడుతోంది. కరోనా వైర‌స్ భ‌యంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని స‌మాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి త‌మ క్యారెక్ట‌ర్ ఇమేజ్ త‌గ్గుతుంద‌ని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట‌.

ఇక ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబర్‌లో స్టార్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇందులో కంటెస్టెంట్స్ ఇ్ప‌టికే ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. HM TV యాంకర్ రోజాతో పాటుగా టీవీ5 మూర్తి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే టీవీ9 యాంకర్ ప్రత్యూష కూడా మెర‌వ‌బోతోంది. ఈసారి ఎక్కువ‌గా చాన‌ల్స్ యాంక‌ర్ల‌ను రంగంలోకి దింపుతోంది బిగ్‌బాస్ టీమ్‌. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, బమ్ చిక్ బబ్లూ లాంటి స్టార్లు కూడా వ‌స్తున్నారంట‌. మంగ్లీ, లోబో పేర్లు కూడా ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts