బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్…?

June 16, 2021 at 4:38 pm

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మరో కొత్త చిక్కు వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ కు పాస్ పోర్ట్ విషయంలో తాజాగా కోర్టులో చుక్కెదురైంది. ఆవిడ పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో ఆమెకు తీరేలా లేవు. ఇదివరకు ఆవిడ దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న కారణంగా పాస్ పోర్ట్ రెన్యూవల్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ. దీంతో ఆవిడ ముంబై హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. అయితే తాజాగా కోర్టు ఈ కేసును జూన్ 25కు వాయిదా వేసింది.

ప్రస్తుత నెలలో షూటింగ్ నిమిత్తం హంగేరిలోని బుడాపెస్ట్‌ కు వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈ జూన్ 15 నుంచి ఆగస్టు 30 వరకు చిత్ర యూనిట్ షెడ్యూల్‌ ప్లాన్‌ ఉంది. అంతేకాకుండా పాస్‌ పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న అయిపోనుంది. దీంతో పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయాలనీ అధికారులను కంగనా విజ్ఞప్తి చేసింది. ఇది ఇలా ఉండగా కంగనా పై పోలీస్ కేసు ఉన్న కారణంగా తాము రెన్యూవల్ చేయలేమని అధికారులు తేల్చారు. దీనికి కారణం ఎవరికైనా పాస్ట్ పోర్ట్ రెన్యువల్‌ చేయాలంటే పోలీస్‌ వెరిఫికేషన్‌ కచ్చితం. గత కాలంలో బాంద్రా పోలీస్‌ స్టేషన్‌ లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. దీంతో కంగనా రనౌత్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయడనికి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు.

బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts