న్యూ లుక్ లో విక్రమ్ ఫోటోస్ వైరల్..!

June 12, 2021 at 4:53 pm

విలక్షణ నటుడు విక్రమ్..ఏ సినిమా చేసినా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో ఆయన శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా చేశాడు, అపరిచితుడు చేశాడు. ఆ సినిమాలో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆయన్న విలక్షణ నటుడు అని అందరూ అంటారు. ఏ పాత్రలో అయినా ఆయన ఒదిగిపోతాడు. తాజాగా ఆయన కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఆ సినిమా రూపొందుతోంది. సినిమాలో చియాన్ విక్రమ్‌ 20 డిఫరెంట్‌ గెటప్స్‌లో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి లుక్ లీక్ అయ్యింది.

దర్శకుడు అజయ్ ఈ సినిమాలో విక్రమ్ గెటప్ ను షేర్ చేశాడు. నల్ల గడ్డం, తెల్లని మీసాలతో చాలా ఏజ్డ్ పర్సన్ లాగా విక్రమ్ కనిపిస్తున్నాడు. పోయిన సంవత్సరం మార్చి నెలలో రష్యాలో కోబ్రా షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ కొనసాగలేకపోయింది. ఎట్టకేలకు సినిమా మళ్లీ మొదలైంది. ప్రస్తుతం విక్రమ్ లుక్ వైరల్ అవుతోంది.

న్యూ లుక్ లో విక్రమ్ ఫోటోస్ వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts