సీఎం మనవడు హిమాన్షు అరుదైన అవార్డు..!

June 29, 2021 at 3:11 pm

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఆయన కుమారుడు కేటీఆర్ సైతం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ ఏదో ఓక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తూ బిజీగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ కుమారుడు ఇటువంటి సమయంలో ఓ రికార్డు నెలకొల్పాడు. సీఎం కేసీఆర్ మనవడు అయిన హిమాన్షు రావు ఓ అద్బుతమైన గౌరవం వరించింది. హిమాన్షు రావుకి డయానా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు సాధారణంగా 9 సంవత్సరాల నుంచి పాతిక ఏళ్ల వయస్సు ఉన్నోళ్లకు మాత్రమే ఇస్తారు. మరి ఇటువంటి అవార్డును సీఎం కేసీఆర్ మనవడికి ఇవ్వడం జరిగింది. నేటి సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఇటువంటి అవార్డు ఇవ్వడం జరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షుకు ఈ అవార్డును ఇచ్చారు. ఈ అవార్డును దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరుపై ఇవ్వడం జరుగుతుంది. బ్రిటన్ కేంద్రంగా ఈ యొక్క అవార్డును ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఆ అవార్డును పొందిన వారిని ప్రకటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి మేలు చేసే యువకులకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కొన్ని గ్రామాల్లో ప్రజలకు మేలు చేసే పనులను చేశాడు. ఆయన స్వయంగా శోమ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాలల్లో కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇటువంటి ప్రాజెక్టును చేసిన హిమాన్షును తాత అయిన సీఎం కేసీఆర్ అభినందించారు. హిమాన్షు ఈ సందర్భంగా తన తాత గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టు కోసం సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు కూడా హిమాన్షు రావు కృతజ్ఞతలు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ అవార్డు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం మనవడు హిమాన్షు అరుదైన అవార్డు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts