టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?

June 6, 2021 at 3:54 pm

భారత్ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు పెట్టింది. అయితే మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని కరోనా దెబ్బకు ఆ టోర్నమెంట్ కూడా నిర్వహించలేమని ఈసారి ఐపీఎల్ లా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌నే నిర్వహించలేక సతమతమయ్యింది భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు. ఇప్పుడు 16 జట్లు పాల్గొనే టీ-20 వరల్డ్‌కప్‌ను ఎలా నిర్వహించగలదని సర్వత్రా చర్చ నెలకొంది. అయితే టీ-20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ఓ స్పష్టమైన అధికార ప్రకటన ఇంకా చేయలేదు. అయితే మ్యాచులు నిర్వహించడం మాాత్రం ఖాయమని తెలుస్తోంది.

టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts