ఆంధ్రలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు..?

తెలుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదయింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కాగా ఈ వైరస్ అతని నుంచి మరెవరికీ వ్యాప్తి చెందలేదని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

భవిష్యత్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో… వైద్య సిబ్బంది, అన్ని శాఖలు పూర్తి తయారుగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి నాని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై చర్చించినట్లు తెలిపారు. రాష్ర్టంలో కరోనా బాధితులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త కరోనా వేరియంట్లతో పాటు బ్లాక్ ఫంగస్ పై పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ర్టంలో విధించిన లాక్ డౌన్ పై రానున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.