దర్శకురాలిపై కేసు..?

June 11, 2021 at 5:09 pm

ఇప్పుడు రాజ‌ద్రోహం కేసులు అనేవి వరుస‌గా వినిపిస్తున్న పేర్లు. ఒక వైపు సుప్రీంకోర్టులో దీనిపై దర్యాప్తు జ‌రుగుతుండ‌గానే మరో దిక్కు లక్షద్వీప్ పోలీసులు సినీ నటిపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. లక్షద్వీప్‌‌నకు చెందిన సినీ నిర్మాత క‌మ్ డైరెక్ట‌ర్ అయిన ఆయిషా సుల్తానాపై స్థానిక పోలీసులు దేశద్రోహం కేసు ఫైల్ చేశార‌ని తెలుస్తోంది.

స్థానిక బీజేపీ అధ్యక్షుడు అయిన సి. అబ్దుల్ ఖాదిర్ అయిషా సుల్తానాపై చేసిన ఫిర్యాదు ప్ర‌కారం పోలీసులు ఈ కేసు న‌మోదు చేశారు. అయిషా ఇటీవల ఒక మళయాళం టీవీ ఛానల్ తో ప్రోగ్రామ్ చేసేట‌ప్పుడు ప్రఫుల్‌ పటేల్‌పై పై తీవ్ర ఆరోప‌ణ‌లు, వ్యాఖ్య‌లు చేసింది. ప్రఫుల్ పటేల్ అంటే కేంద్రం పంపించిన ఒక జీవాయుధ మ‌ని వ్యంగ్యంగా మాట్లాడింది. ప్ర‌ఫుల్ ప‌టేల్ రాక ముందు తమ దీవిలో ఒక్క కొవిడ్ కేసూ న‌మోదు కాలేద‌ని చెప్పింది. కాగా ఇపుడు మాత్రం ప్ర‌తి రోజూ వంద వ‌ర‌కు కేసులు వ‌స్తున్నాయంటూ స్ప‌ష్టం చేసింది. అయితే ఒక గ‌వ‌ర్న‌ర్‌పై చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు ఆమెపై దేశద్రోహం కింద కేసు న‌మోదైంది.

దర్శకురాలిపై కేసు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts