డ్ర‌గ్స్ కేసులో సినీ న‌టి అరెస్టు..?

June 15, 2021 at 12:16 pm

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో చాలామంది ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా బర్త్‌డే పార్టీలో డ్ర‌గ్స్ వాడరన్న ఆరోపణలతో ఓ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేయ‌డం క‌ల‌కలం రేపింది. రీసెంట్‌గా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకుంటుండ‌గా పోలీసులు పక్కా సమాచారం మేరకు వెళ్లి రైడ్‌ చేసి ఆమెను అరెస్టు చేశారు.

బ‌ర్త్ డే రోజు పార్టీ నిర్వహించిన నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. కాగా నటి నైరా నేహాల్‌ షా తన బర్త్‌ డే సందర్భంగా నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో త‌న స్నేహితులకు మంచి పార్టీ ఇచ్చింది. అయితే ఈ పార్టీకి గోవాకు చెందిన తన స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ కూడా వ‌చ్చారు. వీరిద్దరూ క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్నారు. ఇప్ప‌డు వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా వారికి బెయిల్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

డ్ర‌గ్స్ కేసులో సినీ న‌టి అరెస్టు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts