ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉందా…?

అక్కినేని సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా అలరిచిడంతో… రెండో సీజన్‌ పై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. ఎల్టీఈ ఛాయలు కనిపిస్తుడడంతో పాటు ఇండియా, శ్రీలంక, లండన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రీలంకలో తమిళ నాయకుడు భాస్కరణ్ దళాన్ని అంతం చేసేందుకు ఇండియా సాయం చేస్తుంది. కానీ, ఇంతలో భాస్కరణ్ అక్కడినుంచి తప్పించుకుంటాడు.

రెండో ఎపిసోడ్‌లో అంతా ఎదురు చూస్తున్న అక్కినేని సమంత ఎంట్రీ ఇస్తుంది. మొదట్లో అమాయకంగా చిత్రీకరించిన పాత్రలో రాజేశ్వరి (రాజి) (‏సమంతా) కనిపిస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ముగిసిన తర్వాత మూడో సీజన్ కూడా ఉందనే విషయం కొసమెరుపుగా మారింది. కోల్‌కతాను కేంద్రంగా చేసుకొని చైనా దేశీయులు కరోనావైరస్ వ్యాప్తి చేయడం అనేది మూడో సీజన్‌కు ముడిసరుకుగా మారింది. ఆసక్తికరమైన రీతిలో ముగింపు ఇచ్చి మూడో సీజన్ కోసం ఎదురు చూసేలా చేశారు.