గేట్ ఎగ్జామ్స్ లో కీలక మార్పులు…?

2022లో నిర్వహించే గేట్ పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటన వెలువడింది. గతంలో పరీక్షా పత్రంలో మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు మల్టీపుల్ సెలక్ట్ క్వశ్చన్లు అడగబోతున్నారు. అంటే గతంలో ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆన్సర్లు ఇచ్చి అందులో సరైన దాన్ని గుర్తించాలని అడిగేవారు. ఈ కొత్తవిధానంలో మాత్రం ఎన్ని సరైన సమాధానాలు ఇస్తే అవన్నీ గుర్తించాల్సి ఉంటుంది. అలా గుర్తిస్తేనే ఇకపై గేట్ పరీక్షలో మార్కులు ఇవ్వనున్నారు.

అభ్యర్థులకు రెండు పేపర్లు రాసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఎలక్ట్రికల్ అభ్యర్థులు అది మాత్రమే రాసేవారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ తోపాటు బీటెక్ లోని మరో సబ్జెక్ట్ ను కూడా ఎంచుకొని రాసే అవకాశం కల్పించారు. గేట్ పరీక్షలో ఈ సంవత్సరం నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ జియోమెటిక్ ఇంజనీర్ కోర్టులను కూడా చేర్చినట్లు తెలిపారు. దీంతో గేట్ లోని మొత్తం సబ్జెక్టుల సంఖ్య 29కి చేరింది.