గుడ్ న్యూస్ : డ్రైవింగ్ లైసెన్సుల గడువు పెంపు..!

వాహనదారులకు గుడ్ న్యూస్. కరోనా వల్ల ఎక్కడికక్కడ అన్నీ స్తంభించిపోయాయి. ఆర్థిక స్థితి మందగించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు శుభవార్త అందింది. వాహనదారులకు ఇప్పటి వరకూ లైసెన్సులకు సబంధించి అనేక రకాల ఇబ్బందులు తలెత్తేవి. తాజాగా ఆ ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో డ్రైవింగ్ చేసేవారికి ఓ గుడ్ న్యూస్ అందింది.

డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్ల గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు ఆ గడవును పొడిగించడం వల్ల చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు గడువును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగించింది. మోటారు వాహనాల చట్టం (1988), కేంద్ర మోటారు డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ ను పెంచింది. వాహనాల నిబంధనలు పరిధిలోకి వచ్చే అన్నిరకాల పత్రాల గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటులో ఉంటాయి.