ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

June 16, 2021 at 11:52 am

ఇటీవ‌ల చెక్, రంగ్ దే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత‌ చైతన్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ మ‌రో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్, ఎన్టీఆర్‌ నటించిన టెంపర్ లాంటి చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారబోతున్నాడట.

ఈ క్రమంలోనే నితిన్‌కి ఆయన ఒక స్టోరీ చెప్పారని, అది బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న రానుంద‌ని టాక్‌.

ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts