త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైప‌ర్ ఆది

June 15, 2021 at 5:04 pm

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. త‌న పంచ్ డైలాగుల‌తో ఇప్పుడు జ‌రుగుతున్న‌ అనేక విష‌యాల‌పై, గొడ‌వ‌ల‌పై ఆయ‌న స్పందిస్తున్నారు. ఇదే ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తెస్తోంది. కొన్నిసార్లు ఆయ‌న పంచ్‌లు వివాదానికి దారి తీసి ఫిర్యాదులు కూడా వ‌స్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయ‌న త‌న స్కిట్ లో బ‌తుక‌మ్మ‌ను, పాట‌ను అవ‌మానించాడ‌ని ఫిర్యాదు వ‌చ్చింది.

బ‌తుక‌మ్మ పాట‌ను అవ‌హేళ‌న‌గా మాట్లాడి హైప‌ర్ ఆది అవ‌మానించాడంటూ తెలంగాణ జాగృతి స‌భ్యులు ఎల్బీన‌గ‌ర్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆది వివ‌ర‌ణ ఇచ్చారు. ఎవరో కావాల‌నే త‌న స్కిట్‌లో బతుకమ్మ పాట స్ట్రాట్ చేశారని, అప్పుడు తాను కేవలం ఆ పాట‌ను మాత్ర‌మే అనుసరించానని వివ‌రించాడు హైప‌ర్ ఆది. అంతే గానీ తాను ఎలాంటి తప్పుడు మాటలు అన‌లేద‌ని, తాను చెప్పిన పదాన్ని ఎడిటింగ్ లో డిలీట్ చేశారంటూ చెప్పాడు. తాను తప్పు చేశాన‌ని భావిస్తే క్షమాపణ చెప్పడానికి కూడా త‌న‌కు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు హైప‌ర్ ఆది.

త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైప‌ర్ ఆది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts