రంగం హీరోయిన్ కార్తిక ఏం చేస్తుంది.. ఆఫ‌ర్లు లేక అలా..?

June 9, 2021 at 11:33 am

కార్తిక నాయ‌ర్‌.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తిక.. నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన జోష్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత జీవా సరసన త‌మిళంలో ఆమె నటించిన రెండో చిత్రం రంగం మంచి విజ‌యం సాధించింది. దాంతో కార్తిక‌కు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది.

ఇక హిట్టు ప‌డిన వెంట‌నే కార్తిక‌.. త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌పై దృష్టి సారించి ప‌లు సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆమెకు క‌లిసిరాదు. అయితే మ‌ళ్లీ దుమ్ము సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించి.. మంచి హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత బ్రదర్ అఫ్ బొమ్మలి అనే సినిమాలో మెరిసింది. తెలుగులో ఇదే ఈమె చివ‌రి సినిమా.

ఏదేమైన‌ప్ప‌టికీ..ఇండస్ట్రీలో తల్లి రాధ తెచ్చుకున్నంత గుర్తింపు కార్తీక ద‌క్కించుకోలేక‌పోయింది. అలాగే సినిమాల ఎంపికలోనూ పొరపాట్లు చేయడంతో ఆమెకు ఆఫ‌ర్లు కూడా స‌న్న‌గిల్లాయి. దీంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన కార్తిక‌.. ప్ర‌స్తుతం యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

రంగం హీరోయిన్ కార్తిక ఏం చేస్తుంది.. ఆఫ‌ర్లు లేక అలా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts