పాట్న‌ర్‌తో కీర్తి సురేష్ పిక్‌నిక్‌.. ఫొటోలు వైర‌ల్‌!

June 19, 2021 at 8:17 am

మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ మ‌హేష్‌ స‌ర‌స‌న సర్కారు వారి పాటు, గుడ్ లక్ సఖితో పాటు ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. జూన్ 18న ఇంట‌ర్నేష‌న‌ల్ పిక్‌నిక్ డేను పురస్క‌రించుకొని స‌రాద‌గా గ‌డిపిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది కీర్తి.

అంతేకాదు, ప‌ర్‌ఫెక్ట్ వాతావ‌ర‌ణంలో, ప‌ర్‌ఫెక్ట్ పాట్న‌ర్‌తో ఉన్నాను. ఇంత‌కంటే నాకు ఏం కావాలి అంటూ క్యాప్ష‌న్‌ను రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోల్లో ఏదో బీచ్ ఒడ్డున త‌న పెట్ డాగ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కీర్తి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం కీర్తి షేర్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పాట్న‌ర్‌తో కీర్తి సురేష్ పిక్‌నిక్‌.. ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts