వైరల్ పిక్ : యోగాస‌నంతో మహా నటి..!

మహానటి సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అందాల నటి కీర్తి సురేష్‌. తన అందం అభినయంతో ఇత‌ర భాష‌ల‌లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది కీర్తి. ఎల్లప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే ఈ అందాల భామ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ పిక్స్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా కీర్తి యోగాసనాలకు సంబంధించిన కొన్ని పోజులు ఇస్తూ అందరిచేత వావ్ అనిపించుకుంటుంది కీర్తి సురేష్.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూవీ షూటింగ్స్అన్ని ఆగిపోయి అందరు ఇళ్లకే ప‌రిమిత‌మవుతున్నారు. ఇలాంటి సమయంలో యోగ‌స‌నాలు చేస్తూ తన టెన్ష‌న్ త‌గ్గించుకుంటుందట కీర్తి. త్వరలోనే కీర్తి కనటించిన గుడ్ లక్ సఖి, మరక్కార్ అనే మలయాళ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట లో కథానాయికగా నటిస్తున్నారు.