కేజీయఫ్ 2” రిలీజ్ పై న్యూ అప్డేట్….నిజమెంత అంటే..?

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజిఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సూపర్ హిట్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావడం.. అలాగే దానికి సంబంధించిన పనులు అన్ని కూడా పూర్తి అయ్యాయని.. కాకపోతే, covid 19 వైరస్ కారణంగా సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు చిత్ర బృందం కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా జూలై 16న విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

అయితే ఈ సినిమాని జూలై 16న విడుదల అయ్యేలా కనపడట్లేదు. దీంతో అక్టోబర్ నెలకు పోస్ట్ పోన్ చేసినట్లు టాక్స్ వినిపించాయి. అయితే మరికొందరు మాత్రం జూలై 16 నే ఈ సినిమా విడుదల అవుతుందని, మరికొందరు జూలై 16 నే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందొ అన్న తేదీని ప్రకటిస్తారని అనేక ఆసక్తికరమైన టాక్స్ వినబడుతున్నాయి. అయితే తాజాగా మళ్లీ ఈ చిత్రం జూలై 16 నుండి సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నట్లు అనేక వర్గాల నుంచి టాక్ మొదలైంది. చూడాలి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘన విజయం సాధించిన ఈ భారీ చిత్రం పై ఎన్నో విషయాలు వినిపిస్తున్న నేపథ్యంలో సినిమా దర్శక నిర్మాతలు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయటానికి సుముఖత చూపుతున్నారో.