మహేష్ సరసన కృతిసనన్…?

June 13, 2021 at 2:42 pm

తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ హీరోయిన్ బదులిచ్చింది.

ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమనడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటారని, ఆయనతో వర్క్ చేయడం నిజంగా గొప్ప విషయమని చెప్పుకొచ్చింది. త్వరలో మరోసారి ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలని ఉందని తెలిపింది. దీంతో నెటిజన్లు త్వరలోనే మహేష్ బాబు ఆడిపాడనుందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రభాష్ తో ఆదిపురుష్ సినిమా కోసం జటకట్టింది.

మహేష్ సరసన కృతిసనన్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts