శంకర్‌ను వ‌ద‌ల‌ని లైకా..ఈసారి తెలంగాణ హైకోర్టులో పిటీషన్!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్ష‌న్స్‌ మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం ఓ ప‌ట్టాన తేల‌డం లేదు. విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా భారతీయుడుకి సీక్వెల్‌గా ఇండియన్-2 ని ప్రారంభించారు. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌గా, అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది.

ఈ లోపే శంకర్ తన తదుపరి ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే తమ సినిమాను పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాను ప్రారంభించడాన్ని తప్పుబడుతూ.. లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆయన కొత్త సినిమా చేయకుండా స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.

అయిన‌ప్ప‌టికీ.. శంక‌ర్‌ను లైకా వ‌దిలిపెట్ట‌డం లేదు. మ‌ద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. తమ ఇండియన్ 2 ను పూర్తి చేసిన తర్వాత తెలుగులో చరణ్ తో సినిమా చేయాలని ఆదేశించాలంటూ పిటీష‌న్ వేశార‌ట‌. మ‌రి ఇక్క‌డైనా లైకాకు అనుకూలంగా తీర్పు వ‌స్తుందేమో చూడాలి.